నెక్లెస్ రోడ్డులో 10 కే రన్ ప్రారంభం | 10 k run starts at Necklace road in Hyderabad | Sakshi
Sakshi News home page

నెక్లెస్ రోడ్డులో 10 కే రన్ ప్రారంభం

Nov 30 2014 8:36 AM | Updated on Sep 2 2017 5:24 PM

నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో 10కే రన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ రన్ను భారత మాజీ అథ్లెట్ల మిల్కా సింగ్ ప్రారంభించారు.

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో 10కే రన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ రన్ను భారత మాజీ అథ్లెట్ల మిల్కా సింగ్ ప్రారంభించారు. ఈ రన్లో వేలాది మంది యువతియువకులు పాల్గొన్నారు. నగరంలో 12వ సారి 10 కే రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెన్కే రన్ ఫౌండేషన్ వెల్లడించింది.

10 కే రన్ విజేతలకు రూ. 30 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామని తెలిపింది. 10 కే రన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డులో ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement