నిలోఫర్లో ఫ్యాన్ విరిగి.. బాలుడికి గాయాలు | child injured in nilofer as fan fell on him | Sakshi
Sakshi News home page

నిలోఫర్లో ఫ్యాన్ విరిగి.. బాలుడికి గాయాలు

Oct 9 2015 3:24 PM | Updated on Oct 17 2018 5:43 PM

నిలోఫర్ ఆస్పత్రిలో ఫ్యాన్ ఊడిపడి బాలుడికి గాయాలు అయ్యాయి.

హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో ఫ్యాన్ ఊడిపడి బాలుడికి గాయాలు అయ్యాయి.  ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిగ్గా లేకపోవడంతో చిన్నపిల్లల వార్డులో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ వార్డులో గర్భిణులు, చిన్నపిల్లలే ఉంటారు. ఇక్కడి ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని కొన్నాళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా ఎవరి పట్టించుకోలేదని తెలుస్తున్నది.

ఈ నేపథ్యంలో ఫ్యాన్ ఊడిపడి బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు రోగులకు కరెంటు షాకులు కూడా తగులుతున్నాయని చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఖర్చు భరించలేక ఇక్కడికొస్తున్నామని, ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయని రోగులు, వాళ్ల బంధువులు ఆవేదన చెందుతున్నారు. అసలు ఏమీ జరగలేదని, ఇలాంటి ఘటన జరిగినట్లు తన దృష్టికి రాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్  చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement