విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం | Bullets found in Man's Bag at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

Dec 15 2015 3:21 PM | Updated on Sep 3 2017 2:03 PM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించటం కలకలం రేపింది.

శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించటం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్టణం వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన జయరాం అనే వ్యాపారవేత్తను భద్రతా సిబ్బంది సోదాలు చేయగా అతని వద్ద నాలుగు బుల్లెట్లు లభించాయి. వాటితోపాటు వాడేసిన బుల్లెట్లు కూడా నాలుగు దొరికాయి. దీనిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement