ఆకాశాన్ని మోసే పక్షి! | small Poetry - GundamPati Vijayasarathy | Sakshi
Sakshi News home page

ఆకాశాన్ని మోసే పక్షి!

Jan 11 2015 1:16 AM | Updated on Sep 2 2017 7:30 PM

ఆకాశాన్ని మోసే పక్షి!

ఆకాశాన్ని మోసే పక్షి!

చిట్టి కవితలు - గుండంపాటి విజయసారథి

చిట్టి కవితలు
- గుండంపాటి విజయసారథి
 
గది గోడపై
కాలాన్ని మోస్తూ క్యాలెండర్
కాలాన్ని మేస్తూ గడియారం
 ''
 హేమంతం
 చలికి వణుకుతూ
 నక్షత్రాలు
 ''
 పున్నమి రాత్రి
 నదిలో చేపై
 చందమామ
 ''
 ఎండ కాసేపు
 చెట్టు నీడలో
 విశ్రమించింది
 ''
 ఆకాశానికి
 వింజామరలు వీస్తూ
 పక్షుల గుంపు
 ''
 రెక్కలు సాచి
 ఆకాశాన్ని మోస్తున్న
 ఒంటరి పక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement