breaking news
small Poetry
-
బేషరమిత్వ
చిట్టి కవితలు - సైఫ్ అలీ స్త్రీకిచ్చే అత్యంత గౌరవం బేషరమై ప్రేమించడమే న్యాయదేవతకన్నా.... ఆడోళ్ళు గొప్పోళ్ళు బేషరం ఏది పట్టించుకోకుండా మూర్ఖులను కూడా ప్రేమిస్తారు పూలదండలతో గుమ్మం మొత్తం సింగారించినా ఏం లాభం సీతాకోకచిలుకలకు ఏదో భయం నా బేషరం గుమ్మంలోకి రావడానికి దునియాలో నీకు నచ్చే నీలాంటి వారు ఒక్క చోటే దొరుకుతారు బేషరం అద్దాల గోడలున్న గదిలో తప్పిస్తే ఇంకెక్కడ దొరకరు నీకు కావల్సినంత ప్రేమ ఎప్పటికీ దొరకదు ఈ లోకంలో కాని నువ్వు బేషరమై ఇంకొకరికి కావల్సినంత ప్రేమ ఇవ్వొచ్చు ప్రపంచంలో ఎన్నో రకాల పనికిమాలిన గురువులు ఎంతో మంది ఉండొచ్చు వాస్తవానికి మగాడికి మాత్రం బేషరం స్త్రీయే అద్భుతమైన గురువు నాకు నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఎవరూ బోధించలేదు బేషరమై అవసరమైనప్పటి నుంచి నా శ్వాసని నేనే తీసుకోవడం మొదలెట్టాను ప్రాచీన ప్రేమ కావ్యాలు చదువుతుంటే ఒక్కటే అనిపిస్తది నాకన్నా ముందే ఎంతో మంది బేషరంలు ఈ మట్టి మీద పుట్టి ఉన్నారని వాస్తవానికి అందరు కోరుకునే జీవన విధానం ఒక్కటే ఎన్ని కష్టాలు పడ్డా చివరకు బేషరం సుఖం కోసమే ముసలితనం ఎప్పుడు ప్రారంభమౌతుందో నీకు తెలిసే క్షణం మై బేషరం చిన్నపిల్లాడిని కాదని అనుకోవడం షురు చేసిన సమయం (facebook: Directorgoreysaifali ) -
ఆకాశాన్ని మోసే పక్షి!
చిట్టి కవితలు - గుండంపాటి విజయసారథి గది గోడపై కాలాన్ని మోస్తూ క్యాలెండర్ కాలాన్ని మేస్తూ గడియారం '' హేమంతం చలికి వణుకుతూ నక్షత్రాలు '' పున్నమి రాత్రి నదిలో చేపై చందమామ '' ఎండ కాసేపు చెట్టు నీడలో విశ్రమించింది '' ఆకాశానికి వింజామరలు వీస్తూ పక్షుల గుంపు '' రెక్కలు సాచి ఆకాశాన్ని మోస్తున్న ఒంటరి పక్షి