రాంగ్ గైస్! | Jennifer Lopez a 'phenomenal' kisser: Josh Lucas | Sakshi
Sakshi News home page

రాంగ్ గైస్!

Jan 11 2015 11:46 PM | Updated on Sep 2 2017 7:34 PM

రాంగ్ గైస్!

రాంగ్ గైస్!

కావాలనుకుని... ఆపై కాదనుకుని... అన్నీ అయిపోయాక ఏదో జరిగిపోయిందని బాధపడుతోంది హాలీవుడ్ కలల రాణి జెన్నిఫర్ లోపెజ్.

కావాలనుకుని... ఆపై కాదనుకుని... అన్నీ అయిపోయాక ఏదో జరిగిపోయిందని బాధపడుతోంది హాలీవుడ్ కలల రాణి జెన్నిఫర్ లోపెజ్. ఇప్పటి వరకూ తాను ‘రాంగ్ గైస్’తోనే సహజీవనం చేశానని తెగ మథనపడిపోతోంది. నలభై ఐదేళ్ల తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానంది. ‘నేను ఓ మంచి గాళ్‌ఫ్రెండ్‌గా, ఒకరికి భార్యగా చేయాల్సినవన్నీ చేశాను. అయినా నాకు ఎదురైన మగవాళ్లందరూ తప్పుడు మనుషులే’ అంటూ వాపోయింది.

గత ఏడాది వచ్చిన లోపెజ్ జ్ఞాపకాల ‘ట్రూ లవ్’లో ఆవేదనంతా వెళ్లగక్కింది ఈ సూపర్ సింగర్. మార్క్ యాంథోనీతో విడాకుల ఎపిసోడ్, వేధింపుల జీవితం... సహజీవనం, సంసారంలో అనురాగమే లేక ఎంతగా మనోవేదన అనుభవించిందీ గుర్తు చేసుకుంది జెన్నిఫర్.

Advertisement
 
Advertisement
Advertisement