నెక్లెస్ గాయబ్.. | Bookmarked necklace .. | Sakshi
Sakshi News home page

నెక్లెస్ గాయబ్..

Feb 12 2015 12:20 AM | Updated on Sep 2 2017 9:09 PM

నెక్లెస్ గాయబ్..

నెక్లెస్ గాయబ్..

గోరు చుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరిన సోనమ్ కపూర్‌కు ఇంకో షాక్ తగిలింది.

గోరు చుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరిన సోనమ్ కపూర్‌కు ఇంకో షాక్ తగిలింది. తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డెమైండ్ నెక్లెస్ దొంగతనానికి గురైంది. ఇటీవల ఓ పార్టీకి అటెండ్ అయిన సోనమ్.. తన రూమ్‌లో నెక్లెస్ ఉంచింది. కాసేపటికి అది కనిపించకపోయే సరికి అమ్మడు బిత్తరపోయింది. నెక్లెస్ మిస్సింగ్‌పై సోనమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మిస్సయిందంటున్న నెక్లెస్ ఖరీదు రూ.5 లక్షలట. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నెక్లెస్ మిస్సవ్వడాన్ని ఈ మిస్ కాస్త సీరియస్‌గానే తీసుకుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement