ఉప్పమ్మ ఉప్పు! | raviteja ''raj the great'' movie update | Sakshi
Sakshi News home page

ఉప్పమ్మ ఉప్పు!

May 6 2017 11:03 PM | Updated on Sep 5 2017 10:34 AM

ఉప్పమ్మ ఉప్పు!

ఉప్పమ్మ ఉప్పు!

ఉప్పమ్మ ఉప్పు... చిన్నప్పుడు నాన్న భుజాల మీదో తాత భుజాల మీదో, స్నేహితులతోనో ఆడుకున్న ఆట గుర్తుండే ఉంటుంది.

ఉప్పమ్మ ఉప్పు... చిన్నప్పుడు నాన్న భుజాల మీదో తాత భుజాల మీదో, స్నేహితులతోనో ఆడుకున్న ఆట గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఈ ఫొటోను గమనిస్తే... రవితేజ, మెహరీన్‌ ఆ ఆటే ఆడుకుంటున్నట్లుంది కదూ. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం డార్జిలింగ్‌లో కీలక సన్నివేశాలు తీశారు.

అక్కడే రవితేజ, మెహరీన్‌ ఈ ఆట ఆడుకున్నారు. అఫ్‌కోర్స్‌ ఇది సినిమాలో సీన్‌ అనుకోండి. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. మరి.. కళ్లు కనిపించని ఈ హీరోగారు హీరోయిన్‌ని భుజాల మీద ఎక్కించుకుని మరీ ఎక్కడికి తీసుకెళుతున్నట్లు? సినిమాలో చూద్దాం. అన్నట్లు.. ఈ చిత్రబృందం  డార్జిలింగ్‌కి గుడ్‌ బై చెప్పేసింది. త్వరలో హైదరాబాద్‌లో షెడ్యూల్‌ మొదలుపెట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement