వంటింటి చిట్కాలు | kitchen tips | Sakshi
Sakshi News home page

వంటింటి చిట్కాలు

May 28 2016 11:35 PM | Updated on Sep 4 2017 1:08 AM

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

ఉపయోగించిన టూత్ బ్రష్‌లతో వంటింట్లో సింకులు, కంప్యూటర్ కీ బోర్డులు, టీవీ రిమోట్లు శుభ్రం చేసుకోవచ్చు.

ఉపయోగించిన టూత్ బ్రష్‌లతో వంటింట్లో సింకులు, కంప్యూటర్ కీ బోర్డులు, టీవీ రిమోట్లు శుభ్రం చేసుకోవచ్చు.

ఛీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

కోసిన ఉల్లిపాయ సగమే వాడినప్పుడు మిగతా సగం ముక్కకు వెన్న రాసి ఉంచాలి. తాజాగా ఉంటుంది.

వేడి చేసిన గరిటెతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పుట్టదు.

పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి కలపాలి.

కూరల్లో, పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలపాలి.

మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారేయకుండా స్టీలు గిన్నెలు, వెండి సామాన్లను తోమితే శుభ్రపడతాయి.

మజ్జిగ పల్చనైతే పది కరివేపాకు ఆకులు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కబడుతుంది.

తెల్లని బట్టలు ఉతికాక పసుపు మరకలు అలాగే ఉంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, ఉతికి ఎర్రటి ఎండలో ఆరేయాలి.

రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ఉండను హ్యాండ్‌బ్యాగులో ఉంచితే దుర్వాసన రాదు.

హ్యాండ్ వాష్ లిక్విడ్‌ను దూదితో అద్దుకొని తుడిస్తే లెదర్ బ్యాగుల దుమ్ము సులువుగా వదిలిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement