దుపట్టు | heroines new fashion show | Sakshi
Sakshi News home page

దుపట్టు

Nov 3 2016 11:11 PM | Updated on Sep 3 2019 8:44 PM

మోడ్రన్, స్టైలిష్, లేటెస్ట్ ఖాదీ, కాందారీ టస్సర్, చందేరీ షిఫాన్, జార్జెట్ కుర్తా ఏదైనా కానీ పైన ఒక ‘పట్టు’

మోడ్రన్, స్టైలిష్, లేటెస్ట్ ఖాదీ, కాందారీ  టస్సర్, చందేరీ షిఫాన్, జార్జెట్  కుర్తా ఏదైనా కానీ పైన ఒక ‘పట్టు’ వేస్తే  అదేనండి పట్టు దుపట్టా వేస్తే పోస్ట్ నియో మోడ్రన్ కట్ కూడా  ట్రెడిషనల్ అయిపోతుంది.  పట్టు దుపట్టా.. అదే దు‘పట్టు’.

 

పాలనురుగు లాంటి తెల్లటి లాంగ్ అనార్కలీ ఫ్రాక్ మీదకు ఎరుపు రంగు పట్టు దుపట్టా సంప్రదాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తుంది.

లాంగ్ అనార్కలీ సెట్‌కి అదే రంగు జరీ జిలుగుల అంచు గల దుపట్టా  ధరిస్తే, సంప్రదాయంగా  కనువిందు చేస్తూనే స్టైలిష్  మార్కులు కొట్టేస్తారు.


లాంగ్ అనార్కలీ  సెట్ మీదకు పాత కాలం నాటి చీరలకుండేలా పెద్ద అంచున్న పట్టు దుపట్టా వేడుకను కళాత్మకంగా మార్చేస్తుంది.
 
గోల్డ్ కలర్ లాంగ్ కుర్తాకి బెనారస్ పట్టు దుపట్టా  ఏ వేదిక మీదనైనా, ఏ వేడుకలోనైనా సంప్రదాయపు హంగుతో ఆకట్టుకుంటుంది.

తెల్లని కుర్తా పైజామా మీదకు మెజెంటా కలర్ ప్యూర్ సిల్క్ దుపట్టా ప్రత్యేక ఆకర్షణ.

స్టైలిష్  ప్లెయిన్ రెడ్ కుర్తాకు క్రీమ్ కలర్ దుపట్టా ధరిస్తే చూపు తిప్పుకోలేని అందంతో మెరిసిపోవచ్చు

Advertisement
 
Advertisement
Advertisement