డీల్స్ అండ్ డిస్కౌంట్స్ | deals and discounts | Sakshi
Sakshi News home page

డీల్స్ అండ్ డిస్కౌంట్స్

Jan 18 2014 12:57 AM | Updated on Aug 14 2018 4:01 PM

ఆన్‌లైన్ షాపింగ్ జోరందుకుంటోంది. దానికి తగ్గట్టే డీల్స్ కూడా అదిరిపోతున్నాయి. షాప్‌క్లూస్‌డాట్‌కామ్.. క్లియరెన్స్ సేల్ పెట్టింది. ఇందులో భాగంగా 80 శాతం పైగా డిస్కౌంట్లిస్తోంది.

ఆన్‌లైన్ షాపింగ్ జోరందుకుంటోంది. దానికి తగ్గట్టే డీల్స్ కూడా అదిరిపోతున్నాయి. షాప్‌క్లూస్‌డాట్‌కామ్.. క్లియరెన్స్ సేల్ పెట్టింది. ఇందులో భాగంగా 80 శాతం పైగా డిస్కౌంట్లిస్తోంది. ఆభరణాలకు సంబంధించి పెండెంట్ సెట్‌ని రూ.1,099కి, ముత్యాల హారాలను రూ.698కి, గృహోపకరణాలకి సంబంధించి ఇండక్షన్ కుకింగ్ సెట్ లాంటి వాటిని రూ.888 స్థాయిలో అందిస్తోంది. అటు ల్యాప్‌టాప్ స్పెషల్ కేటగిరీ కింద అసూస్ తదితర ల్యాప్‌టాప్స్‌పై 20 శాతం దాకా డిస్కౌంట్స్ ఇస్తోంది. రూ. 15,275 నుంచి ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి.
 
  ఇలా చెయ్యొచ్చు... ఆటోమేటిక్ విత్‌డ్రాయల్..
     దీర్ఘకాలికంగా పొదుపు చేయాలనుకున్నప్పుడు వాటికి ప్రతి నెలా కచ్చితంగా డబ్బు చేరేలా బ్యాంక్ ఖాతాలో ఆటోమేటిక్ విత్‌డ్రాయల్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయండి. నెల తిరిగేసరికల్లా డబ్బు మీ ఖాతాలోంచి వెళ్లిపోవటం వల్ల చేతిలో డబ్బు ఆడక ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ అలవాటైపోతుంది. చేతిలో ఉన్న సొమ్ముకు మాత్రమే సరిపడేలా బడ్జెట్ దానంతటదే  సర్దుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement