కొత్త పెళ్లికూతురు కబుర్లు! | Chat with the new bride! | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికూతురు కబుర్లు!

Nov 3 2014 9:54 PM | Updated on Sep 2 2017 3:49 PM

కొత్త పెళ్లికూతురు కబుర్లు!

కొత్త పెళ్లికూతురు కబుర్లు!

ఎట్టకేలకు అందాల రాశి దియా మీర్జా పెళ్లి, ప్రేమికుడు సాహిల్ సంఘాతో ఇటీవల ఘనంగా జరిగింది.

పెళ్లి పుస్తకం
 ఎట్టకేలకు అందాల రాశి దియా మీర్జా పెళ్లి, ప్రేమికుడు సాహిల్ సంఘాతో ఇటీవల ఘనంగా జరిగింది. భర్త సాహిల్ గురించి దియా చెప్పిన కబుర్లు ఇవి...
 
తొలిసారి...
ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా నా దగ్గరికి వచ్చాడు. అతను స్క్రిప్ట్‌ను వినిపించిన పద్ధతి, హావభావాలు నాకు ‘నచ్చాయి’. ఇక అప్పటి నుంచి ఈ నచ్చడాల జాబితా పెరుగుతూ పోయి ప్రేమ వరకు, అక్కడి నుంచి పెళ్లి వరకు వచ్చింది.చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలుస్తాయి. ఒరినొకరం ఇష్టపడడానికి ఇదొక కారణం.
 
గాఢమైన ప్రేమలో...
సాహిల్‌కు కాస్త గర్వం ఎక్కువనే మాట నేనూ విన్నాను. అది నిజమైనా దాని వల్ల నేనేమీ ఇబ్బంది పడను. నిజం చెప్పాలంటే, నిండా ప్రేమలో మునిగిన వారికి ఏదీ సమస్య కాదు. చిన్న సమస్యకు ఆవేశకావేశాలకు లోనయ్యే ప్రేమ కాదు మాది. చెప్పాలంటే పరిణతితో కూడిన ప్రేమ. గట్టి పునాది ఉన్న గాఢమైన ప్రేమ.
 
ఒక్క ‘సారీ’ కాదు...
అప్పుడప్పుడు చిలిపి తగాదాలు మా మధ్య చోటు చేసుకుంటాయి. చాలా సందర్భాల్లో ఆయనే సారీ చెప్పి తగాదాకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారు. ఆయన సారీ చెప్పినందుకు... నేను మళ్లీ సారీ చెబుతాను. ఇక ఆ రోజంతా సారీలతోనే గడిచిపోతుంది.
 
వంటంటే ఎంతిష్టం!
మా ఇద్దరికీ వంట చేయడం అంటే మహా ఇష్టం. నేను ఇండియన్ వంటకాలు బాగా చేస్తాను. కొన్నిసార్లు హైదరాబాదీ వంటకాలు, కొన్నిసార్లు పంజాబీ వంటకాలు చేస్తుంటాను. నేను చేసే బిర్యానీ, కట్టి దాల్, ఖీమా..లాంటి హైదరాబాద్ వంటకాలంటే సాహిల్‌కు ఇష్టం. సాహిల్ యూరోపియన్, ఇటలియన్, థాయ్ వంటకాలు బాగా చేస్తాడు.
 - దియా మీర్జా, హీరోయిన్

Advertisement
 
Advertisement
Advertisement