సెప్టెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrate the birthday on September 7 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Sep 7 2015 12:06 AM | Updated on Sep 3 2017 8:52 AM

సెప్టెంబర్  7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య. పుట్టిన తేదీ 7.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
జ్వాలా గుత్తా (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
మమ్ముట్టి (నటుడు), రాధికా ఆప్టే (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య. పుట్టిన తేదీ 7. ఇది కేతుసంఖ్య. వీరిపై వచ్చే బర్త్‌డే వరకు శుక్ర, కేతు గ్రహాల ప్రభావం ఉంటుంది. వీరికి మంచి వాక్చాతుర్యం ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. విదేశాలలో చదువు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, రచయితలకు, బోధన రంగంలో ఉన్న వారికి, విలాస వస్తువుల విక్రయ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక తీరుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు.

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వారికి జీతాలలో వృద్ధి, ఉద్యోగరీత్యా ఫారిన్ ఛాన్స్ ఉంటుంది. పిల్లల విద్యా వివాహాల సందర్భంగా ఆడంబరాలకు పోయి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు పరిమితి పాటించడం అవ సరం. కుటుంబ బాధ్యతలు మీదపడతాయి.

 లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, బ్లూ, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు.
 సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మానసా దేవిని ఆరాధించడం, శక్తి ఉన్న వారు భృగు పాశుపత హోమం చేయించుకోవడం, అనాథ బాలికలకు ఆర్థిక సహాయం చేయటం, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement
 
Advertisement
Advertisement