ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ | ysrcp mla SV Mohan reddy Scorpio car stolen in kurnool | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ

Mar 5 2016 9:46 AM | Updated on May 29 2018 2:33 PM

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ - Sakshi

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ

కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వీ మోహన్రెడ్డి కారు చోరీకి గురైంది.

కర్నూలు : కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్రెడ్డి  స్కార్పియో వాహనం చోరీకి గురైంది. ఆయన నివాసంలో పార్క్ చేసిన వాహనాన్ని దుండగులు శుక్రవారం ఆర్థరాత్రి అపహరించుకు పోయారు. ఆ విషయాన్ని శనివారం ఉదయం గుర్తించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి  టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఎ. రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎస్వీ మోహన్రెడ్డి నివాసం ఉంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  మూడు రోజుల క్రితమే స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు.

కాగా కర్నూలు నగరంలో  చోరీలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. చోరీలపై నగర ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో  పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాక్షాత్తూ ఎమ్మెల్యే వాహనమే చోరీకి గురికావడం సంచలనం సృష్టిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement