వైఎస్సార్‌సీపీ కటౌట్లకు నిప్పు | YSRCP cutout fired | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కటౌట్లకు నిప్పు

Nov 29 2016 3:05 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్‌సీపీ కటౌట్లకు నిప్పు - Sakshi

వైఎస్సార్‌సీపీ కటౌట్లకు నిప్పు

మండలంలో కొత్తకోట గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కటౌట్‌లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు.

కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు
రావికమతం: మండలంలో కొత్తకోట గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కటౌట్‌లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి ధర్మశ్రీకి మద్దతుగా నాయకులు ఈ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌లకు నిప్పటించడంతో గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు గుమ్మడు సత్యదేవ, శీలం శంకరరావు, పందల దేవాలు సోమవారం కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఎస్.ఐ శేఖరం కేసును నమోదు చేశారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement