మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | youngman suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

May 29 2017 11:59 PM | Updated on Nov 6 2018 8:08 PM

ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఎస్‌ఎస్‌ నగర్‌లో నివాసం ఉంటున్న బోయ బాబు ట్రాలీ ఆటోలో పండ్లను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి కుమారుడు నాగేంద్రకుమార్‌ (20)ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తూ ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు అంగీకరించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా నాగేంద్రకుమార్‌ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement