కాలువలో పడి యువకుడి గల్లంతు | youngman missing at canel | Sakshi
Sakshi News home page

కాలువలో పడి యువకుడి గల్లంతు

Sep 24 2016 11:43 PM | Updated on Sep 4 2017 2:48 PM

కాలువలో పడి యువకుడి గల్లంతు

కాలువలో పడి యువకుడి గల్లంతు

ప్రమాద వశాత్తు కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద ఎరుకపాడు వార్పు రోడ్డులో నివాసం ఉంటున్న పఠాన్‌ బిస్మిల్లా (23) తాపీ పని చేస్తున్నాడు.

గుడివాడ:
 ప్రమాద వశాత్తు కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద ఎరుకపాడు వార్పు రోడ్డులో నివాసం ఉంటున్న పఠాన్‌ బిస్మిల్లా (23) తాపీ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కార్మిక నగర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో చంద్రయ్యడ్రైను వద్ద స్నేహితులతో మాట్లాడుతూ కాలుజారి కాలువలో పడ్డాడు. డ్రైను ఉధృతంగా ఉండటం వల్ల ప్రవాహానికి కొట్టుకు పోతుండటంతో స్నేహితుడు శ్రీకాంత్‌ కాలువలోకి దూకి రక్షించేందుకు యత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులకు తెలపటంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదని బంధువులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement