టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల | Will give the houses to those who related to TDP:Minister bojjala | Sakshi
Sakshi News home page

టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల

Feb 17 2016 7:40 AM | Updated on Aug 10 2018 8:35 PM

టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల - Sakshi

టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల రుణాలు మంజూ రంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తామంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో కొద్దిపాటి ఇళ్లే మంజూరవుతున్నందున ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్లకే అవకాశమిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల రుణాలు మంజూరుచేస్తే తప్పేంటని బొజ్జల ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement