హెచ్‌ఎల్సీ కాలువకు నీరు విడుదల | water release to hlc canal | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎల్సీ కాలువకు నీరు విడుదల

Aug 11 2017 10:20 PM | Updated on Jun 1 2018 8:39 PM

తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేయడానికి బళ్లారి కలెక్టర్‌ రాంమనోహర్‌ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌: తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేయడానికి బళ్లారి కలెక్టర్‌ రాంమనోహర్‌ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం డ్యాంలో నీటి కొరత ఏర్పడడంతో జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఫొన్‌ ద్వారా బళ్లారి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తాగునీటి అవసరాల కోసం నీటిని వదులుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 13న తుంగభద్ర ఇరిగేషన్‌ బోర్డు మీటింగ్‌ అనంతరం నీరు వదిలేందుకు చర్యలు తీసుకుంటామన్నారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement