గుప్త నిధుల కోసం తవ్వకాలు | Thanks for the hidden funds | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Jan 6 2017 1:05 AM | Updated on Sep 17 2018 8:02 PM

గుప్త నిధుల కోసం తవ్వకాలు - Sakshi

గుప్త నిధుల కోసం తవ్వకాలు

మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నంద్యాలంపల్లె – ముసల్‌రెడ్డిపల్లె రహదారిలో పురాతన కోనేరులో రెండు రోజుల క్రితం గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు.

సింహాద్రిపురం : మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నంద్యాలంపల్లె – ముసల్‌రెడ్డిపల్లె రహదారిలో పురాతన కోనేరులో రెండు రోజుల క్రితం గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కసనూరు గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు మహేశ్వరరెడ్డి పొలంలో పురాతన కాలం నాటి కోనేరు ఉంది. దాని పక్కనే ఉన్న పురాతన సత్రాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో గుప్త నిధుల కోసం కోనేటిలో ఉన్న పెద్ద బండరాళ్లను సైతం తొలగించారు. అక్కడ పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement