శ్రీచైతన్య పాఠశాల సీజ్‌ | sri chaithanya school seaz in anantapur | Sakshi
Sakshi News home page

శ్రీచైతన్య పాఠశాల సీజ్‌

May 16 2017 11:24 PM | Updated on Sep 15 2018 5:45 PM

స్థానిక కోర్టురోడ్డులో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌ను మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి మంగళవారం సీజ్‌ చేశారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : స్థానిక కోర్టురోడ్డులో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌ను మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి మంగళవారం సీజ్‌ చేశారు. విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన చేసిన నేపథ్యంలో ఎంఈఓ తనిఖీ చేశారు. గవర్నింగ్‌బాడీ మేరకు ఫీజులను నిర్ణయించి, వాటిని నోటీస్‌బోర్డులో ఉంచాలని స్వయంగా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించినా యాజమాన్యం పాటించలేదని, ముందస్తు అడ్మిషన్లు కూడా చేస్తున్నారని ఎంఈఓ తెలిపారు. నిబంధనలు పాటించకపోవడంతో సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బండి పరుశురాం, సాకే నరేష్, జనార్ధన్, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement