విశాఖలో ఘనంగా శివరాత్రి వేడుకలు | Shivarathri celebrations in vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో ఘనంగా శివరాత్రి వేడుకలు

Mar 7 2016 9:10 PM | Updated on Aug 13 2018 4:19 PM

మహా శివరాత్రిని పురస్కరించుకుని విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్లో సోమవారం టీఎస్ఆర్ సేవ పీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విశాఖ: మహా శివరాత్రిని పురస్కరించుకుని విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్లో సోమవారం టీఎస్ఆర్ సేవ పీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గంట శ్రీనివాసరావు, పెందుర్తి శారదాపీఠాధిపతి స్వరూపనానేంద్ర సరస్వతి, సినీ ప్రముఖులు కృష్ణంరాజు, సుమన్, రాజశేఖర్, జీవిత, పరుచూరి గోపాల కృష్ణ, సాలూరు వాసురాం బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంగీత, సాహిత్య రంగాల్లో సేవలందించిన కళాకారులు, రచయితలు 10 మందిని శివ శక్తి అవార్డులతో టీఎస్ఆర్ సేవా పీఠం సత్కరించింది. ఇందులో నటుడు కృష్ణంరాజుకు విశ్వ విఖ్యాత నట వీర బిరుదుతో టీఎస్ఆర్ సేవా పీఠం ఘనంగా సత్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement