బెల్లంపల్లిలో దారి దోపిడీ | petrol bunk manager loot in bellampally | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లిలో దారి దోపిడీ

Aug 4 2016 9:20 AM | Updated on Sep 4 2017 7:50 AM

బెల్లంపల్లి మండలంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో దారి దోపిడీ సంఘటన చోటుచేసుకుంది.

బెల్లంపల్లి(ఆదిలాబాద్): బెల్లంపల్లి మండలంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో దారి దోపిడీ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బెల్లంపల్లి శివారులో ఉన్న కన్నాల సోనీ పెట్రోలు బంకు మేనేజర్ సయ్యద్ ఆసిఫ్ పెట్రోలు అమ్మగా వచ్చిన డబ్బులతో అశోక్‌నగర్‌లోని తన ఇంటికి బైక్‌పై ఒంటరిగా బయలు దేరాడు. మూసీవేతకు గురైన 68-డి బొగ్గు గని వద్ద ఇద్దరు దుండగులు దారి కాచి ఆసిఫ్‌ను అడ్డగించారు.

అతనిని కొట్టి అతని వద్ద నున్న రూ.3.40 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement