ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం | old stundents meeting | Sakshi
Sakshi News home page

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Sep 11 2016 8:41 PM | Updated on Sep 4 2017 1:06 PM

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హుజూర్‌నగర్‌ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1966–67లో హెచ్‌ఎస్‌సీ చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

హుజూర్‌నగర్‌ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1966–67లో హెచ్‌ఎస్‌సీ చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి పాఠశాలల మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. అనంతరం మెమెుంటోలు అందజేశారు. అదే విధంగా పూర్వ విద్యార్థి డాక్టర్‌ ఎన్‌వీ.రాఘవరావు అంద జేసిన రూ. లక్ష విరాళాన్ని ప్రతిభ గల విద్యార్థులకు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు లక్‌పతినాయక్‌కు అందజేశారు. ఇటీవల భారీ వర్షానికి కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి సైతం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు యుగంధరశర్మ, నర్సింహారావు, పెంటయ్య, సోమయ్య, విశ్వేశ్వరరావు,  శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement