పురాతన నాణేలు స్వాధీనం | old coins recover | Sakshi
Sakshi News home page

పురాతన నాణేలు స్వాధీనం

Aug 29 2017 11:10 PM | Updated on Jun 1 2018 8:39 PM

కర్ణాటకలోని బీజాపూర్‌ కోటలో తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలను విక్రయించేందుకు సిద్ధపడ్డ నిందితుడు బెస్త కరుణాకర్‌బాబును నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం సెంట్రల్‌: కర్ణాటకలోని బీజాపూర్‌ కోటలో తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలను విక్రయించేందుకు సిద్ధపడ్డ నిందితుడు బెస్త కరుణాకర్‌బాబును నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాత నేరస్తుడుగా ఉన్న సదరు నిందితుడు బుధవారం తపోవనం బస్‌స్టాప్‌ వద్ద పురాతన నాణేలతో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి అమ్మవారి విగ్రహం, మత్తు పానీయం సేవించే పాత్ర, , రాగి బిందె, 822 రాగి నాణెలు స్వాధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సీఐ శ్యామరావు వెల్లడించారు. నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలిస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement