‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..! | new Driving license cards | Sakshi
Sakshi News home page

‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..!

Nov 4 2016 2:04 AM | Updated on Sep 4 2017 7:05 PM

‘కొత్త’ లెసైన్స్   కార్డులొచ్చాయ్..!

‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..!

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్టేషన్, డ్రైవింగ్ లెసైన్స్ సాఫ్ట్‌వేర్

ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్టేషన్, డ్రైవింగ్ లెసైన్స్
సాఫ్ట్‌వేర్ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చారుు. పెండింగ్ కార్డులతో వాహనదారుల ఇబ్బందులపై ఈనెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కార్డులు ఇంకెన్నడు..!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన ఐదు జిల్లాల పర్యవేక్షణాధికారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొత్త జిల్లాల లోగోతో కూడిన కార్డులను గురువారం పూర్తిస్థారుులో విడుదల చేశారు.

జిల్లాకు సుమారు ఐదువేల కార్డుల చొప్పున అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కార్డులను వేగంగా ఆయా జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ముద్రణ పూర్తి చేసి స్పీడ్‌పోస్ట్‌కు అందజేశారు. ప్రతి వినియోగదారుడు మరో రెండు రోజుల్లో రిజస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్‌‌సకార్డులను అందుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement