మోటారు వాహనం ధ్వంసం | motor vehicle collapsed | Sakshi
Sakshi News home page

మోటారు వాహనం ధ్వంసం

Aug 1 2016 11:49 PM | Updated on Sep 4 2017 7:22 AM

నుజ్జయిన మోటారు వాహనం

నుజ్జయిన మోటారు వాహనం

తన ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన మోటారు వాహనాన్ని అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బండి నుజ్జునుజ్జయిందని వాహనదారుడు బలివాడ సాయికృష్ణ స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు
 
వీరఘట్టం: తన ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన మోటారు వాహనాన్ని అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బండి నుజ్జునుజ్జయిందని వాహనదారుడు బలివాడ సాయికృష్ణ స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. స్థానిక జనావీధి సమీపంలో ప్రధాన రహదారిలో నివాసముంటున్న తాను ఎప్పటివలే ఇంటి ముందర ద్విచక్రవాహనం హ్యాండిల్‌ లాక్‌ వేసి ఇంటిలో నిద్రపోయానన్నారు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3 మధ్య ఈ ఘటన జరిగి ఉంటుందని తెలిపారు. దీని విలువ సుమారు రూ. 60 వేలు ఉంటుందన్నారు. పోలీస్‌లు దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తామని ఎస్సై బి.రామారావు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement