26న నిరుద్యోగులకు జాబ్‌మేళా | jobmela on26ht | Sakshi
Sakshi News home page

26న నిరుద్యోగులకు జాబ్‌మేళా

Oct 24 2016 11:21 PM | Updated on Sep 4 2017 6:11 PM

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్‌స్టెప్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్‌స్టెప్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్సు, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మాసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారన్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ.8వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ప్రతి పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారని, ఎంపికైన వారు కర్నూలులోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు స్థానిక కల్లూరు ఎస్టేట్స్‌లోని సెట్కూరు కార్యాలయానికి ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 9177016174 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement