బీసీ సంక్షేమాధికారిగా హుసేన్‌సాహెబ్‌ | hussain saheb as bc welfare officer | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమాధికారిగా హుసేన్‌సాహెబ్‌

Oct 10 2016 8:13 PM | Updated on Mar 21 2019 8:35 PM

బీసీ సంక్షేమాధికారిగా హుసేన్‌సాహెబ్‌ - Sakshi

బీసీ సంక్షేమాధికారిగా హుసేన్‌సాహెబ్‌

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిగా గాలేరు నగరి సుజల స్రవంతి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డీ హుసేన్‌సాహెబ్‌ బాధ్యతలు స్వీకరించారు.

కర్నూలు(అర్బన్‌): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిగా గాలేరు నగరి సుజల స్రవంతి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డీ హుసేన్‌సాహెబ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీబీసీడబ్ల్యూఓగా విధులు నిర్వహించిన బీ సంజీవరాజు ఈ నెల 7 30వ తేదీ వరకు మెడికల్‌ లీవ్‌లో వెళ్లడంతో హుసేన్‌సాహెబ్‌కు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం ఆయనకు సంజీవరాజు బాధ్యతలను అప్పగించారు. బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ శ్రీనివాసులు, పెద్దపాడు వసతి గృహ సంక్షేమాధికారి శ్రీనివాసులు.. హుసేన్‌సాహెబ్‌కు స్వాగతం పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement