హజ్‌యాత్ర పుణ్యకార్యం | haj is holy tour | Sakshi
Sakshi News home page

హజ్‌యాత్ర పుణ్యకార్యం

May 1 2017 11:59 PM | Updated on Sep 5 2017 10:08 AM

హజ్‌యాత్ర పుణ్యకార్యమని దారుల్‌ ఉలూమ్‌ ఐనుల్‌ హుదా ప్రిన్సిపల్‌ అల్‌హాజ్‌ ముఫ్తి అబ్దుర్‌ రహిమాన్‌ సాహబ్‌ పేర్కొన్నారు.

– అల్‌హాజ్‌ ముఫ్తి అబ్దుర్‌రహిమాన్‌
– రాయలసీమ హజ్‌ సొసైటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రికులకు శిక్షణ తరగతులు
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర పుణ్యకార్యమని   దారుల్‌ ఉలూమ్‌ ఐనుల్‌ హుదా ప్రిన్సిపల్‌ అల్‌హాజ్‌ ముఫ్తి అబ్దుర్‌ రహిమాన్‌ సాహబ్‌ పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ మక్కాకు వెళ్లిరావాలని సూచించారు. రాయలసీమ హజ్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హజ్‌ యాత్రికులకు స్థానిక మెరీడియన్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్‌ యాత్రలో చేసే దువా తప్పకుండా  ఫలిస్తుందని,  అక్కడ లోక కల్యాణం కోసం ప్రార్థించాలని సూచించారు. కార్యక్రమానికి రబ్బాని గోదాము అధినేత అల్‌హాజ్‌ తాటిపాడు మహబూబ్‌బాషా, మెరీడియన్‌ ఫంక‌్షన్‌ హాల్‌ అధినేత బషీర్‌అహ్మద్, మౌలానా సులేమాన్‌ నద్వి, చాంద్‌బాషా (గద్వాల), ముస్తాఖ్‌అహ్మద్‌ (ఆదోని) తదితరులు  అతిథులుగా హాజరై మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement