ఘనంగా గురుపూజోత్సవం | guru puja at alladurgam | Sakshi
Sakshi News home page

ఘనంగా గురుపూజోత్సవం

Sep 7 2016 6:53 PM | Updated on Sep 4 2017 12:33 PM

అల్లాదుర్గంలో ఉత్తమ ఉపాధ్యాయురాలుకు సన్మానం

అల్లాదుర్గంలో ఉత్తమ ఉపాధ్యాయురాలుకు సన్మానం

అల్లాదుర్గం మండలంలో గురుపూజోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

అల్లాదుర్గం : అల్లాదుర్గం మండలంలో గురుపూజోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5న నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని వినాయక చవితికి సెలవు రావడంతో బుధవారం నిర్వహించాల్సి వచ్చిందని ఎంఈఓ బాలయ్య చెప్పారు. మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు పూల మాలలు వేసి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి పూలమాలలు, శాలువాలు, అవార్డులతో సత్కరించారు.

కార్యక్రమంలో ఎంపీపీ రాంగారి ఇందిర నారాయణ, జేడ్పీటీసీ కంచరి మమత, ఎస్‌ఐ ఎం.డి.గౌస్, ఎంపీడీఓ రత్నమాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రేమ్‌కుమార్, రాములు, భాస్కర్, నాజర్, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అనూరాధ, హెచ్‌ఎం ధనుంజయ్య, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కిష్టయ్య, జానార్ధన్, బిజ్జే సత్యనారాయణ, సాయిలు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement