అనంతపురం అగ్రికల్చర్ : అజొల్లా, హైడ్రోఫోనిక్ పద్ధతుల ద్వారా ఏడాది పొడవునా పచ్చిగడ్డి తీసుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశుశాఖ ద్వారా ఈ ఏడాది 90 శాతం రాయితీతో అజొల్లా, 75 శాతం రాయితీతో హైడ్రోఫోనిక్ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైన రైతులు పశుశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
అజొల్లా
రోజుకు నాలుగు కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.50 ‘‘ 1.5 మీటర్ల సైజులో ఒక తొట్టి తయారు చేసుకుని ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల తాజా మదర్ కల్చర్ అజొల్లా బెడ్‌పై సమానంగా పడేలా చల్లాలి. జాగ్రత్తలు పాటించి 8వ రోజు నుంచి ప్రతిరోజూ ఒక్కో తొట్టి నుంచి కిలో అజొల్లా గడ్డి తీసుకోవచ్చు. అజొల్లాను సూటిగా సూర్యకాంతి పడని, మరీ ఎక్కువ నీడ పడని ప్రదేశంలో పెంచాలి. ఎండబెట్టిన అజొల్లా పొదిలో 25–35 శాతం మాంసపు కృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. ఇందులో లిగ్నైట్ తక్కువగా ఉండటంతో పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. రోజూ 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువుకు తినిపించవచ్చు. ఫలితంగా పాల డిగుబడి 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు.
హైడ్రోఫోనిక్ గడ్డి
బార్లీ, సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి విత్తనాలతో మొలకగడ్డి తయారు చేసుకోవచ్చు. మన ప్రాంతానికి మొక్కజొన్నతోనే లాభదాయకం. అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంతో అవసరం. ప్లాస్టిక్ ట్రేలలో కొన్ని పద్ధతులు పాటించి పెంచితే 8 రోజుల్లో కిలో విత్తనం నుంచి 12–15 కిలోల పచ్చి మేత పొందవచ్చు. ఈ గడ్డిలో 17.2 శాతం ప్రోటీన్లు, 25.4 శాతం పీచు పదార్థం, 84.8 శాతం నీరు ఉన్నట్లుగా ప్రయోగాల్లో రుజువైంది. అలాగే దాణాలో ఉన్న విధంగా విటమిన్లు ఏ, ఈ, లవణాలు, క్యాల్షియం, భాస్వరం ఇతరత్రా పోషక పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. మొలకగడ్డిని 9వ రోజు వేర్లతో సహా పశువుకు పెట్టాలి. ఒక్క పశువుకు 15–20 కిలోల గడ్డి పెట్టవచ్చు. నీరు, భూమి, కరెంటు ఖర్చు తక్కువతోనే ఇంటి వద్ద పెంచవచ్చు. పైగా పాల ఉత్పత్తి 15–20 శాతం పెరుగుతుంది. పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
నిరంతరం పచ్చిగడ్డి
Published Fri, Nov 11 2016 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement