వాస్తు కోసం.. | for vastu | Sakshi
Sakshi News home page

వాస్తు కోసం..

Jul 24 2016 11:26 PM | Updated on Sep 4 2017 6:04 AM

వాస్తు కోసం..

వాస్తు కోసం..

ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. ప్రధానంగా వాస్తును నమ్మేవారు కోకొల్లలు. ప్రధానంగా ఇంటి నిర్మాణం విషయంలో దీన్ని ఎక్కువగా పాటిస్తుంటారు.

 కోర్నపల్లె(కొలిమిగుండ్ల): ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. ప్రధానంగా వాస్తును నమ్మేవారు కోకొల్లలు. ప్రధానంగా ఇంటి నిర్మాణం విషయంలో దీన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. వాస్తు కోసం దేనికైనా సిద్ధపడే వారూ ఉన్నారు.

ఈకోవలోనే కోర్నపల్లెకు చెందిన ఓబయ్య తన ఇంటికి ఎదురుగా వీధి పోటు ఉందనే కారణంతో నమ్మకస్తుడైన వాస్తు సిద్ధాంతి సూచన మేరకు ఇంటి ముందు 20 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పున రాతితో కట్టడం నిర్మించారు. వాటిపై ఆంజనేయస్వామి బొమ్మను గీయించారు. అటు వైపు వెళ్తున్న వారంతా చిత్రాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement