ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ | farmer producing organization in dharmavaram | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్

Jun 30 2016 12:14 PM | Updated on Oct 1 2018 5:09 PM

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంస్థకు రూ. 7 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పంట తోటల సాగును ప్రోత్సహిస్తామన్నారు.

రుణమాఫీ పెండింగ్ బకాయిలను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చిరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల రుణాలును మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement