కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని... | Conductor commits suicide nobody will give debt | Sakshi
Sakshi News home page

కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని...

Oct 28 2015 5:39 PM | Updated on Mar 28 2018 11:11 AM

కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని మనస్తాపం చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని మనస్తాపం చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా మంచాల రోడ్డులో నివాసముంటున్న నీళ్ల రాచకొండ(50) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో కూతురు వివాహం నిశ్ఛయం కావడంతో.. పెళ్లి ఖర్చుల అవసరార్థం అప్పు కోసం ప్రయత్నించాడు. కానీ ఎక్కడ ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో.. చివరకు మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement