ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌ | cm kcr to farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌

Aug 15 2016 9:17 PM | Updated on Jun 4 2019 5:16 PM

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌ - Sakshi

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి 8 గంటల సమీపంలో మెదక్‌ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తమ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు.

జగదేవ్‌పూర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. అనంతరం గవర్నర్‌ నరసింహతో సమావేశమాయ్యరు. అనంతరం రాత్రి 8 గంటల సమీపంలో మెదక్‌ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తమ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు.

 

సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫాంహౌస్‌, రోడ్డు గుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్‌ ద్వారా రోడ్డు మార్గాన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement