బైక్‌ వాగులో పడి మహిళ మృతి | Byk dipped in to pond women died | Sakshi
Sakshi News home page

బైక్‌ వాగులో పడి మహిళ మృతి

Sep 18 2016 12:21 AM | Updated on Sep 17 2018 8:02 PM

బైక్‌ వాగులో పడి మహిళ మృతి - Sakshi

బైక్‌ వాగులో పడి మహిళ మృతి

ప్రమాదవశాత్తు బైక్‌ వాగులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..


హాలియా :  ప్రమాదవశాత్తు బైక్‌ వాగులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాజవరం గ్రామ పరిధిలోని డొక్కలబావితండా వద్ద హాలియా వాగులో శుక్రవారం రాత్రి దామరచర్ల మండలం మొలకచర్ల గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సైదమ్మ(30) హాలియా నుంచి మొలకచర్లకు బైక్‌పై  వస్తుండగా హాలియా వాగు వంతెనపై బైక్‌ అదుపు తప్పివాగులో పడిపోయింది. దీంతో మహిళ ముఖంపై తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా శనివారం ఉదయం స్థానికులు చూసి హాలియా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసలు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని సాగర్‌ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు బోల్లంపల్లి సైదయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌ తెలిపారు. మృతురాలికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా మృతురాలికి గాయాలవడంతో పోలీసులు మందుగా మృతి అనుమానస్పదంగా ఊహించారు. సంఘటనా స్థలాన్ని సీఐ పార్థసారథి పరిశీలించారు. ప్రమాదంపై ఆయన స్థానికులను అడిగి వివరాలు తెలసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement