బీటీ పత్తి విత్తనాల ధర ఖరారు | bt cotton seed price fixed | Sakshi
Sakshi News home page

బీటీ పత్తి విత్తనాల ధర ఖరారు

May 9 2017 10:58 PM | Updated on Sep 5 2017 10:46 AM

బీటీ పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ధర కాస్త తగ్గింది.

– బీటీ–1 ప్యాకెట్‌ ధర రూ.635
– బీటీ–2 ప్యాకెట్‌ ధర రూ.800
 
కర్నూలు(అగ్రికల్చర్‌): బీటీ పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ధర కాస్త తగ్గింది. ఈ ఏడాది జిల్లాలోని కర్నూలు, ఆదోని డివిజన్‌లలో పత్తి సాగు పెరిగే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ జిల్లాకు 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లను కేటాయించింది. బీటీ–1 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.635, బీటీ–2 విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.800లుగా నిర్ణయించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement