నగదు లేక పెళ్లి కూతురి కన్నీళ్లు | Bride request for liquit cash for marriage in parkal sbi branch | Sakshi
Sakshi News home page

నగదు లేక పెళ్లి కూతురి కన్నీళ్లు

Dec 18 2016 8:50 AM | Updated on Aug 29 2018 7:09 PM

నగదు లేక పెళ్లి కూతురి కన్నీళ్లు - Sakshi

నగదు లేక పెళ్లి కూతురి కన్నీళ్లు

కుమార్తె వివాహం కోసం చిట్టి (ఫైనాన్స్‌) డబ్బులు ఎత్తుకుంటే.. నిర్వాహకు లు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు.

పరకాల: కుమార్తె వివాహం కోసం చిట్టి (ఫైనాన్స్‌) డబ్బులు ఎత్తుకుంటే.. నిర్వాహకు లు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు. ఆ డబ్బు ఇవ్వా లంటూ పెళ్లికార్డు తో సహా బ్యాంకుకు వచ్చిన పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఎంత బతి మిలాడినా బ్యాంకు అధికారులు నగదు ఇవ్వ లేదు. దీంతో ఆ పెళ్లికూతురు బ్యాంకులోనే కన్నీటి పర్యంతమైంది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన బొజ్జం శ్రీనివాస్, కరుణ దంప తులు, వారి కుమార్తె అశ్వినిల వ్యథ ఇది. ఈ నెల 22న అశ్విని వివాహం జరుగనుంది. దీంతో డబ్బు కోసం వారు శనివారం ఇక్కడి ఎస్‌బీఐ బ్రాంచికి వచ్చారు. కానీ డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరికి నగదు అందకుండానే కన్నీటితో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement