పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు | 4,280 cusics in west delta | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు

Mar 1 2017 6:03 PM | Updated on Sep 5 2017 4:56 AM

పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు

పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు

కొవ్వూరు: పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం 4,280 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.

కొవ్వూరు: పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం 4,280 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,340 క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్‌ డెల్టాకు 1,660 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్‌ వీకి  489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 28 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. వంతుల వారీ విధానం కారణంగా అత్తిలి కాలువకు నీటి విడుదల తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ కాలువ పరిధిలో ఆయకట్టుకు నీరందకపోవడంతో చేలు నెరలు తీస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement