రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి | Indian-American filmmaker dies after accident in US | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

May 19 2015 11:13 AM | Updated on Sep 3 2017 2:19 AM

రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు.

వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్పై వెళ్తున్న విజయ్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. విజయ్ మోహన్ చికాగో శివారు ప్రాంతంలో జన్మించారు.

ఆయన పాఠశాల విద్య అంతా భారత్లో జరిగింది. అనంతరం ఆయన టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. విజయ్ అంకితభావంతో పని చేస్తాడని ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతడి మృతి పట్ల సంతాపం ప్రకటించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement