9 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి

Published Sun, Dec 17 2017 3:09 AM

The old man sexual herasment 0n 9year old girl - Sakshi

తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి(9)పై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుమాకకు చెందిన చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ కూతుర్ని చదివించుకుంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన కనపర్తి ఆనందరావుసామ్యేలు బాలికను అడ్డగించాడు. ఇంట్లోకి రమ్మని పిలవగా.. ఆ బాలిక వెళ్లలేదు. దీంతో ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి ఇంటి పై అంతస్తులో అత్యాచారం చేశాడు.

కొద్దిసేపటికి అతని నుంచి తప్పించుకున్న బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి పరుగులు తీసింది. అప్పటికే కూలిపనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ఆరాతీయగా.. జరిగిన విషయాన్ని వారికి వివరించింది. దీంతో ఆగ్రహించిన వారు నిందితుడి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడికి ఇద్దరు కుమార్తెలున్నారని, ఆడబిడ్డల తండ్రిలా ఆలోచించకుండా ఓ మృగంలా వ్యవహరించిన అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement