భర్త అక్రమ సంబంధం.. భార్యను చెట్టుకు కట్టేసి.. | Husband Set Wife On Fire In Warangal District | Sakshi
Sakshi News home page

భర్త అక్రమ సంబంధం.. భార్యను చెట్టుకు కట్టేసి..

Aug 5 2018 10:27 AM | Updated on Aug 5 2018 10:58 AM

Husband Set Wife On Fire In Warangal District - Sakshi

కాలిన గాయాలతో మృతిచెందిన రజిత

భర్త  మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి.. ఆగ్రహించిన రజిత భర్త  ఆమెను చెట్టుకు కట్టేసి....

సాక్షి, వరంగల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధం విషయం తెలిసి.. భార్య నిలదీసినందుకు ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు భర్త. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుతండాకు చెందిన రజిత అనే మహిళ తన భర్త  మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రజిత భర్త  ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. మం‍టల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.  

Advertisement
 
Advertisement
Advertisement