సెక్రటేరియట్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో.. | Head Constable Shoots Himself At Delhi Secretariats Parking Lot | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో..

Nov 16 2018 11:25 AM | Updated on Nov 16 2018 11:25 AM

Head Constable Shoots Himself At Delhi Secretariats Parking Lot - Sakshi

ఢిల్లీ సెక్రటేరియట్‌ పార్కింగ్‌ ప్రదేశంలో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సెక్రటేరియట్‌లో శుక్రవారం ఉదయం డ్యూటీలో ఉన్న పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని వీఐపీ పార్కింగ్‌ ప్రదేశంలో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని 35 సంవత్సరాల హెడ్‌ కానిస్టేబుల్‌ సొహన్‌వీర్‌గా గుర్తించారు.

ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో సూసైడ్‌ నోట్‌ను  ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఈ తీవ్ర చర్యకు ఒడిగట్టినట్టు ప్రాధమికంగా వెల్లడైందన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విధి నిర్వహణలో ఒత్తిళ్లతో ఇటీవల పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement