సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్య | CRPF jawan committed suicide | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

Mar 12 2018 1:00 AM | Updated on Nov 6 2018 7:53 PM

CRPF jawan committed suicide - Sakshi

సుఖ్‌దేవ్‌ (ఫైల్‌)

భీంపూర్‌ (బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం బెల్సారి రాంపూర్‌ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాను పుర్క సుఖ్‌దేవ్‌ (24) శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతంలో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ప్రత్యేక వాహనంలో నాగ్‌పూర్‌కు, అక్కడి నుంచి సీఆర్పీఎఫ్‌ వాహనంలో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబసభ్యులు, మిత్రులు అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యకు గల కారణం తమకు తెలియరాలేదని తోటి జవాన్లు, కుటుంబీకులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement