కన్నడ దాడుల్లో 11 కోట్ల ఆస్తులు లభ్యం | 109 Crore In Undisclosed Income Found After Raids On Kannada Actors | Sakshi
Sakshi News home page

కన్నడ దాడుల్లో 11 కోట్ల ఆస్తులు లభ్యం

Jan 7 2019 6:03 AM | Updated on Jan 7 2019 6:03 AM

109 Crore In Undisclosed Income Found After Raids On Kannada Actors - Sakshi

బెంగళూరు: కన్నడ సినీ ప్రముఖుల నివాసాల్లో చేపట్టిన సోదాల్లో రూ. 11 కోట్ల విలువైన ఆస్తులు, నగదు లభ్యమైనట్లు ఆదాయ పన్ను అధికారులు వెల్లడించారు. అలాగే,  లెక్కల్లో చూపని రూ.109 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు కూడా నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నటులు శివరాజ్‌ కుమార్, పునీత్‌ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, నిర్మాతలు సీఆర్‌ మనోహర్, రాక్‌లైన్‌ వెంకటేశ్, విజయ్‌ కిరిగందూర్‌ ఇళ్లపై గురువారం నుంచి శనివారం వరకు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివరాల్ని అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన రూ.11 కోట్ల ఆస్తుల్లో రూ.2.85 కోట్ల నగదు, 25.3 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. తమకు దొరికిన ఆధారాల్ని రెవెన్యూ, ఇతర విచారణ సంస్థలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవాలో పనిచేస్తున్న 180 మంది అధికారులు మొత్తం 26 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement