యమహా నుంచి ‘సెల్యూటో ఆర్ఎక్స్’ బైక్ | Yamaha Saluto RX launched for Rs 46400 | Sakshi
Sakshi News home page

యమహా నుంచి ‘సెల్యూటో ఆర్ఎక్స్’ బైక్

Apr 15 2016 12:20 AM | Updated on Sep 3 2017 9:55 PM

యమహా నుంచి ‘సెల్యూటో ఆర్ఎక్స్’ బైక్

యమహా నుంచి ‘సెల్యూటో ఆర్ఎక్స్’ బైక్

జపాన్ టూవీలర్ తయారీ కంపెనీ ‘యమహా మోటార్’ తాజాగా ఎంట్రీ లెవెల్ బైక్ ‘సెల్యూటో ఆర్‌ఎక్స్’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ధర రూ.46,400
న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ తయారీ కంపెనీ ‘యమహా మోటార్’ తాజాగా ఎంట్రీ లెవెల్ బైక్ ‘సెల్యూటో ఆర్‌ఎక్స్’ను మార్కెట్‌లోకి  విడుదల చేసింది. దీని ధర రూ.46,400 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ప్రధానంగా నలుపు, ఎరుపు, బ్లూ రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్‌లో 4 స్ట్రోక్ 110 సీసీ 2 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, స్పోర్టీ ఎక్స్‌టీరియర్ బాడీ డిజైన్, 4 స్పీడ్ గేర్ బాక్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, యమహా బ్లూ కోర్ టెక్నాలజీ, లైట్ వెయిట్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. సెల్యూటో బైక్ లీటరుకు 82 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. తక్కువ ధరల్లో అధిక మైలేజ్‌ను ఆశిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement