లక్షకు పైగా కార్లను రీకాల్ చేస్తున్న వోక్స్ వాగన్ | Volkswagen to recall 103,569 vehicles in China | Sakshi
Sakshi News home page

లక్షకుపైగా కార్లను రీకాల్ చేస్తున్న వోక్స్ వాగన్

Apr 6 2016 1:39 PM | Updated on Sep 3 2017 9:20 PM

లక్షకు పైగా కార్లను రీకాల్ చేస్తున్న వోక్స్ వాగన్

లక్షకు పైగా కార్లను రీకాల్ చేస్తున్న వోక్స్ వాగన్

చైనా లో 1, 03,569 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు , నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ విభాగం వెల్లడించింది.

 

బీజింగ్ : ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి అల్లాడుతున్న జర్మన్  కార్ల కంపెనీ వోక్స్ వాగన్‌  నెత్తిమీద మరొక పిడుగు పడింది  ఈ కంపెనీకి చెందిన దాదాపు లక్ష కార్లను వెనక్కి తీసుకోనున్నట్టు ప్రకటిస్తూ  సంచలన రేపింది. చైనా లో  లక్షా 3 వేల 569 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు , నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ  విభాగం  వెల్లడించింది.  2010 - 2016 మధ్య  తయారైన  తౌరెగ్  వాహనాల్లో బ్రేక్ పెడల్స్ వైఫల్యం కారణంగా రీకాల్  చేస్తున్నట్టు  తెలిపింది.  బ్రేక్ పెడల్స్ లోని లోపం ప్రమాదాల తీవ్రతను పెంచుతుందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ఏప్రిల్18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానుందని చెప్పింది.   లోపాలున్న వాహనాలన్నింటినీ   క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆయా భాగాలను  ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్టు తెలిపింది.

కాగా  ఆటోమొబైల్స్‌ రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో సత్తా చాటిన జర్మనీ కార్ ల దిగ్గజం వోక్స్ వేగాన్  పలు స్టైలిష్‌ మోడల్స్ తో కార్‌ లవర్స్ హృదయాలను గెలుచుకుంది.  అత్యుత్తమ పనితీరుతో ప్రపంచ ఖ్యాతి గడించింది. అయితే ఉద్గార పరీక్షల ఫలితాల్లో అవకతవకలు ఆరోపణలతో  ఇప్పటికే కంపెనీపై భారీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement