150 పాయింట్లు డౌన్‌: కీలక మద్దతు స్థాయిలు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

150 పాయింట్లు డౌన్‌: కీలక మద్దతు స్థాయిలు బ్రేక్‌

Published Fri, May 18 2018 9:46 AM

Sensex Falls 150 Points, Nifty Near 10,650 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా   ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి.  కర్ణాటక రాజకీయ అనిశ్చితి, ప్రపంచ మార్కెట్ల బలహీనతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.  దీంతో అమ్మకాల ధోరణి నెలకొంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 151 పాయింట్లు క్షీణించి 34998 వద్ద, నిఫ్టీ  40 పాయింట్ల నష్టంతో  10,642వద్ద కొనసాగుతున్నాయి.  దీంతో కీలక సూచీలు  ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి.  సెన్సె‍క్స్‌ 35వేలకు దిగువన, నిఫ్టీ 10700కు దిగవకు  చేరాయి. బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ  నష్టపోతున్నాయి. విప్రో, అల్ట్రాటెక్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్‌  నష్టాల్లోనూ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌, ఐషర్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, లుపిన్‌ లాభాల్లోనూ ట్రేడవుతున్నాయి.

అటు బులియన​ మార్కెట్లో పసిడి బలహీనత కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పసిడి 10గ్రా. 40 రూపాయలు తగ్గి 30,973వద్ద ఉంది. కరెన్సీ మార్కెట్‌లో రుపీ స్వల్పంగా బలపడింది. 0.07పైసలు పుంజుకుని డాలరుమారకంలో 67.86వద్ద  ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement