రోల్స్ రాయిస్ నుంచి డాన్ | Rolls-Royce Dawn Launched in India; Prices Start at Rs. 6.25 Crore - News | Sakshi
Sakshi News home page

రోల్స్ రాయిస్ నుంచి డాన్

Jun 25 2016 1:38 AM | Updated on Sep 4 2017 3:18 AM

రోల్స్ రాయిస్ నుంచి డాన్

రోల్స్ రాయిస్ నుంచి డాన్

బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ తాజాగా తన ‘కన్వర్టిబుల్ డాన్’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను దేశీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ధర రూ.6.25 కోట్లు
ముంబై: బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ తాజాగా తన ‘కన్వర్టిబుల్ డాన్’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను దేశీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ముంబై ఎక్స్ షోరూమ్ ధర రూ.6.25 కోట్లు. ఇందులో 6.6 లీటర్ వీ 12 ఇంజిన్, 2ఁ2 సీటర్, జెడ్‌ఎఫ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. కారు రూఫ్.. గంటకు 50 కిలోమీటర్లు వేగం వద్ద 20 సెకన్లలో క్లోజ్ అవుతుందని తెలిపింది. కాగా కంపెనీకి అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల్లో షోరూమ్‌లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement